Skip to main content

నిద్ర విలువ తెలుసుకోండి !

మంచి నిద్రకు మరి కొన్ని చిట్కాలు: అదృష్టవంతులంటే ఎవరో కాదు, కొందరికి కూర్చున్న చోటనే నిద్ర ముంచుకు వస్తుంది అటువంటి వారిని చుస్తే అదృష్ట వంతులు  అని అనుకుంటాము. బెడ్ మీదకు చేరుకున్న గంట రెండు గంటలకు గని నిద్ర పట్టదు కొందరికి.  మరికొందరికి నిద్ర పట్టినట్లు అనిపించినా, ఒక గంటలో మెలకువ వస్తుంది.  మళ్ళి  ఒక పట్టాన నిద్ర పట్టదు  బెడ్ మీద అసహనంగా దొర్లుతూ ఉంటారు. కానీ ఒక్కోసారి మంచి నిద్ర పట్టిన రోజు ప్రొద్దుననే లేవగానే ఏంటో ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉత్తేజంగా ఉంటుంది.  కానీ రోజు ఇటువంటి అనుభవం కలగదు అది అందరు అనుభూతి చెందేదే.  నిజంగా నిద్రను మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చా? మనం ఎంత సేపు బెడ్ మీద ఉన్నాం అనేది లెక్క కాదు ఎన్ని గంటలు గాడ నిద్ర పోయాం అనేది లెక్క,  మొబైల్ బాటరీ ఎలా రీఛార్జ్ అవుతుందో మంచి నిద్ర తరువాత మన ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. నిద్ర అనేది సహజ ప్రక్రియ ప్రక్రుతి మనకు ప్రసాదించిన వరం.  హార్డ్ రీసెట్ లాంటిది.  మీ మొబైల్ ఒకోసారి హ్యాంగ్ అవుతుంది అని రీస్టార్ట్ చేస్తారు కదా అలాగేయ్ మన బాడీ కూడా.  ఈ శ్రీసిటీలో ప్రతీ ప్రాణి  ఏంటో ...

మీరు అసంతృప్తి లో ఉన్నారా?

డియర్ ఫ్రెండ్స్,  మనలో చాలా మందికి ప్రస్తుతం  ఉన్న పరిస్థితి నచ్చకపోవచ్చు. దానినే అసంతృప్తి
అనుకోవచ్చు.  ప్రతి ఒక్కరిలో ఎంతో ఒకింత  అసంతృప్తి ఉంటుంది.  కోరుకున్న విధంగా జీవితం ఉండకపోవడం

జాబ్ చేసే వాళ్లలో  50% వాళ్ళు చేసే జాబ్ వాళ్లకు ఇష్టం ఉండదు.    మరేదో దొరకలేదని ఆలోచన
అస్తమానం  వాళ్ళని నీడలా వెంటాడుతుంది.

ఇక జాబ్ లేని వాళ్లకు ఇంకా జాబ్ దొరకలేదని బాధ,   ఇలా ప్రతీ స్థాయి మనుషుల్లో వారి వారి స్థాయికి
తగ్గట్లు ఎదో ఒక అసంతృప్తి ఉంటుంది.  అసంతృప్తి ఉండడం మంచిదే కొంతవరకు.  అది పరిమితిలో ఉండాలి
అసంతృప్తి లేకపోతె మనం దొరికిన దానితో తృప్తి పడతాము.  కొత్తవాటిగురించి ఆలోచించము.

అసంతృప్తి వలన  ఆలోచనలు పుడతాయి ... ఆలోచనలు కొత్త  ఆవిష్కరణకులకు  కారణం అవుతాయి.

వ్యతిరేకత ను జయించండి   

మీ  వర్క్ ప్లేస్ లో మీరు చేసే పని అందరి ఆమోద పూర్వకంగా ఉన్న కొందరినుండి  వ్యతిరేకత రావచ్చు.
ఈ వ్యతిరేకతను ఇలా జయించండి.

  • మీ వ్యతిరేకులు చెప్పేది అర్ధం చేసుకోండి.  వారితో వాదించకండి.  దానివలన మీ సమయం వృధా అవుతుంది.
  • ఎదుటి వ్యక్తి మీ మీద ఆరోపణల అస్త్రాలను వదులుతున్నప్పుడు మీరు కోపం తో స్పందించ కండి.
  • ఎదుటి వ్యక్తి ఊహించని వైధంగా మీరు కూల్ గ ఉండండి మీరు కూల్ గ ఉంటె తెలివిగా సమాధానంచెప్పగలరు, 
  • మీ మీద ఆరోపణలు చేసేవాళ్ళు ఎమోషనల్ గ మీ పై దడి చేస్తారు ప్రశాంతం గా ఉండడం వలన మీరు ఆ దాడులను సునాయాసంగా తిప్పి కొట్ట  గలుగుతారు. 
  •  ఒక వేళ మీ తప్పు ఉంటె హుందాగా అంగీకరించండి.
  • దానివలన పోయేది ఏమీ ఉండదు.  పైగా  హుందాగా వ్యవహరించారని అందరు అనుకుంటారు..  గొప్పవాళ్లే ఆలా అంగీకరించగలరు.

మీ వైఖరిని నియంత్రించుకోండి

  • మిమ్మల్ని శాసించే హక్కు ఎవరికీ ఇవ్వకండి.  మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎవరి చేతిలో పెట్టకండి   ప్రాణం పోయిన సెల్ఫ్ రెస్పెక్ట్ ని పోనీయకండి.
  • మీ జీవితానికి సంబందించిన కీలక   నిర్ణయాలు మీరే తీసుకోండి. 
  • నిర్మాణాత్మకం గా ఆలోచించండి  
  • విమర్శలకు కృంగిపోవద్దు.   
  • పరిస్థితులను మీ కంట్రోల్ లో ఉంచుకోండి  
  • చేయవలసిన పనుల లిస్ట్ రాసుకోండి .  
  • ఎప్పటి పనులు అప్పుడు పూర్తీ చేయండి.  వాయిదా పద్దతి వద్దు.  పనులకు ప్రాధాన్యతను నిర్దేశించండి 
  • మీ మొబైల్ లో టాస్క్ మానేజ్మెంట్ అప్ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించండి. 
  •  ప్రశాంతం గా ఉండడానికి ప్రయత్నించండి.  టైం మనజిమెంట్ చేయండి.  దానివలన
    మీ సమయం ఎక్కడ వృధా అవదు.  
  • రాత్రిళ్ళు త్వరగా నిద్ర పోండి సరయిన నిద్ర కనీసం 8 గంటలు అవసరం 
  • పడుకునే ముందు రాత్రి ధ్యానం చేయండి.  ధ్యానం వలన ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది.
  • మీ శక్తికి మించిన వాగ్దానాలు చేయకండి.  ఒక్కోసారి No అనడం చాల అవసరం
  • మొహమాటపడి అందరికి ప్రతి దానికి yes చెప్పారంటే మీరు ఇరుక్కుపోతారు. పైగా మాట తప్పినవారవుతారు.
  • కొందరు వారిపనులు వారు చేసుకోరు మీలా  మొహమాట పడేవాళ్ళకు అప్పచెపుతారు.
  • ఎవరి పనులను వాళ్లనే చేసుకోనివ్వండి,  తప్పని సరి అయితే సహాయం చేయడం లో తప్పు లేదు. 
  • సానుకూల దృక్పధం ఉన్న వ్యక్తులను కలవండి.  దానివలన మీ ఆలోచనలకు ఆచరణ మొదలవుతుంది
  • మీరు చేసే పనులలో కష్ట - నష్టాలను బేరీజు వేసుకునే అవకాశం దొరుకుతుంది 
     
Comments

Popular posts from this blog

నిద్ర విలువ తెలుసుకోండి !

మంచి నిద్రకు మరి కొన్ని చిట్కాలు: అదృష్టవంతులంటే ఎవరో కాదు, కొందరికి కూర్చున్న చోటనే నిద్ర ముంచుకు వస్తుంది అటువంటి వారిని చుస్తే అదృష్ట వంతులు  అని అనుకుంటాము. బెడ్ మీదకు చేరుకున్న గంట రెండు గంటలకు గని నిద్ర పట్టదు కొందరికి.  మరికొందరికి నిద్ర పట్టినట్లు అనిపించినా, ఒక గంటలో మెలకువ వస్తుంది.  మళ్ళి  ఒక పట్టాన నిద్ర పట్టదు  బెడ్ మీద అసహనంగా దొర్లుతూ ఉంటారు. కానీ ఒక్కోసారి మంచి నిద్ర పట్టిన రోజు ప్రొద్దుననే లేవగానే ఏంటో ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉత్తేజంగా ఉంటుంది.  కానీ రోజు ఇటువంటి అనుభవం కలగదు అది అందరు అనుభూతి చెందేదే.  నిజంగా నిద్రను మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చా? మనం ఎంత సేపు బెడ్ మీద ఉన్నాం అనేది లెక్క కాదు ఎన్ని గంటలు గాడ నిద్ర పోయాం అనేది లెక్క,  మొబైల్ బాటరీ ఎలా రీఛార్జ్ అవుతుందో మంచి నిద్ర తరువాత మన ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. నిద్ర అనేది సహజ ప్రక్రియ ప్రక్రుతి మనకు ప్రసాదించిన వరం.  హార్డ్ రీసెట్ లాంటిది.  మీ మొబైల్ ఒకోసారి హ్యాంగ్ అవుతుంది అని రీస్టార్ట్ చేస్తారు కదా అలాగేయ్ మన బాడీ కూడా.  ఈ శ్రీసిటీలో ప్రతీ ప్రాణి  ఏంటో ...
  కోవిడ్ రికవరీ (Post Covid 19)  మనదేశం లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటు అధికంగానే ఉంది. అంటే కోవిడ్ నుంచి క్షేమంగా బయటపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది . ఈ సమయంలో కోవిడ్ నుంచి బయట పడినా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు .  కరోనా వైరస్ నెగెటివ్ వచ్చినప్పటికీ.. చాలా కాలం వరకూ మన శరీరంలో ప్రభావాన్ని చూపించే  చాల వరకు ఉంది. ఒకసారి కరోనా వచ్చి కోలుకున్నవారు శాశ్వతంగా కరొననుండి విముకి చెందినట్లు కాదు అందుకే.. కరోనా నుంచి బయటపడిన వ్యక్తులు అన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకుంటూనే.. శరీరంలోని కొన్ని మార్పులను గమనిస్తూ ఉండాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక పరిశోధనలో  ఏమి తెలిసిందంటే, కరోనా పాక్షికంగా వచ్చి కోలుకున్నవారుకూడా దీర్ఘ కాళిక  ఉచ్చారణ  దోషం తో ఇబ్బంది పడుతున్నట్లు గా తెలిసింది