Skip to main content

నిద్ర విలువ తెలుసుకోండి !

మంచి నిద్రకు మరి కొన్ని చిట్కాలు: అదృష్టవంతులంటే ఎవరో కాదు, కొందరికి కూర్చున్న చోటనే నిద్ర ముంచుకు వస్తుంది అటువంటి వారిని చుస్తే అదృష్ట వంతులు  అని అనుకుంటాము. బెడ్ మీదకు చేరుకున్న గంట రెండు గంటలకు గని నిద్ర పట్టదు కొందరికి.  మరికొందరికి నిద్ర పట్టినట్లు అనిపించినా, ఒక గంటలో మెలకువ వస్తుంది.  మళ్ళి  ఒక పట్టాన నిద్ర పట్టదు  బెడ్ మీద అసహనంగా దొర్లుతూ ఉంటారు. కానీ ఒక్కోసారి మంచి నిద్ర పట్టిన రోజు ప్రొద్దుననే లేవగానే ఏంటో ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉత్తేజంగా ఉంటుంది.  కానీ రోజు ఇటువంటి అనుభవం కలగదు అది అందరు అనుభూతి చెందేదే.  నిజంగా నిద్రను మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చా? మనం ఎంత సేపు బెడ్ మీద ఉన్నాం అనేది లెక్క కాదు ఎన్ని గంటలు గాడ నిద్ర పోయాం అనేది లెక్క,  మొబైల్ బాటరీ ఎలా రీఛార్జ్ అవుతుందో మంచి నిద్ర తరువాత మన ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. నిద్ర అనేది సహజ ప్రక్రియ ప్రక్రుతి మనకు ప్రసాదించిన వరం.  హార్డ్ రీసెట్ లాంటిది.  మీ మొబైల్ ఒకోసారి హ్యాంగ్ అవుతుంది అని రీస్టార్ట్ చేస్తారు కదా అలాగేయ్ మన బాడీ కూడా.  ఈ శ్రీసిటీలో ప్రతీ ప్రాణి  ఏంటో ...

దీర్ఘ శ్వాస వలన ఉపయోగాలెన్నో







 


రోజు అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం బాగా లేట్ గా నిద్రలేవడం రుచి కోసం ఆకలి లేకపోయినా తినడం వీటికి తోడు కలుష్ఠితమయిన గాలి నీరు మన ఆరోగ్య స్థితిని ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పనవసరం లేదు. కొన్నింటిని ఎలాగో కంట్రోల్ చేయలేము. 


 

కనీస ఆరోగ్యం కోసం సరిగ్గా శ్వాస తీసుకోవడం చాలా ముఖ్యం. సరయిన శ్వాసక్రియ విధానం దాని ప్రయోజనాలు లెక్కకు మించి ఉన్నాయి. మనం సహజంగా తీసుకొనే శ్వాస లోపభూయిష్టమయినది అంటే మీరు నమ్ముతారా? ఎన్నో అధ్యయనాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అవును మీరు చదువుతున్నది నిజమే, నేటి జీవన శైలికి ఎమోషన్స్ ఎక్కువ, మనం మన ఎమోషన్స్ కి బానిసలం, అవి మన కంట్రోల్ లో ఉండవు. 


 

ఎప్పుడయినా మీరు టెన్షన్ ఆందోళన లేదా భయం )లో ఉన్నప్పుడు మీ శ్వాస రిథమ్  ను గమనించారా? శ్వాస చాల ఫాస్ట్ గ తీసుకుంటారు అయినా ఆండాలున్న ఆక్సీజెన్ శతం చాల తక్కువ ఆ క్షణం లో మీకు ఆక్సీజెన్ సరిపోదు. అయితే, మీరు ఇప్పటినుండి లోతైన శ్వాస తీసుకోవడానికి ప్రేరేపించే కొన్ని ముఖ్యమైనవి కారణాలు ఈక్రింద ఉన్నాయి. 

 


సహజ నొప్పి నివారిణి : మీరు లోతుగా శ్వాస పీల్చుకున్నప్పుడు, మీ మెదడులోని పియూష గ్రంధి ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది, అవి ఫీల్ గుడ్ హార్మోన్లను రక్తములో మరియు శరీరం సృష్టించి, సహజ నొప్పి నివారిణి ని ఉత్పత్తి చేస్తుంది ఇది గాయాలు అయినప్పుడు సహజ నొప్పి నివారిణి అంటే పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. అంటే నొప్పి కలిగినప్పుడు ఎటువంటి మందులు తీసుకోవలసిన అవసరం ఉండదు.  


 

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: శరీరం నూతనొచ్వాహాన్ని సంతరించుకుంటుంది,రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.డయాఫ్రామ్ కదిలె సమర్ధత పెరిగి, శ్వాస క్రియ మెరుగుపడి శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. కణం - కణం కొత్త శక్తి ని సంతరించుకుంటుంది.పనిచేయని లేదా  పాక్షికంగా దెబ్బతిన్న కణాలను సవరిస్తుంది, దీనివలన కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉండవచ్చు. 


 

మన శరీరం లో కన్ను మొదలయిన సున్నితమయిన అవయవాలుకొన్ని కోట్ల ల సూక్ష్మ రక్తనాళాలని కలిగి ఉంటాయి మెరుగు అయిన రక్తం ప్రతీ సూక్ష్మ రక్తనాళములో కూడా ప్రసరించి మీ కంటి చూపును అద్భుతంగా మెరుగు పరుస్తుంది. శృంగార సమర్ధత పెరుగుతుంది. శృంగార అవయవములలో రక్త ప్రసరణ బాగా జరిగి ఆనందాన్ని పొందుతారు.  


 

వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది: లోతైన శ్వాస మీకు  అందే  ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది దానివలన శరీర కణజాలం లో ఎక్కువ ఆక్సిజన్ చేరుతుంది. తాజా ఆక్సిజన్‌ శరీరమునుండి వ్యర్ధాలను మరియు ఇతర టాక్సిన్స్ మరియు కార్బన్ డయాక్సైడ్‌లను బయటకు తీస్తుంది. రక్తం ఎక్కువ ఆక్సిజన్ తో నిండినప్పుడు ఇది వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, మీ ముఖ్యమైన అవయవాల సున్నితమైన పనితీరును మెరుగు పరుస్తుంది. 


 

 టాక్సిన్ రహిత మరియు ఆరోగ్యకరమైన రక్తము శరీరములో ప్రవహించి, సంక్రమణ(infection) కలుగజేసే సూక్ష్మక్రిములను - వైరస్ లను నివారించడానికి దోహదపడుతుంది. మరియు మీ వ్యాధి నిరోధక శక్తిని బలపరుస్తుంది. లోతైన శ్వాస సహజ టాక్సిన్ రిలీవర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది శరీరంలోని విటమిన్లు మరియు ఇతర పోషకాలను గ్రహించు కోవటానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది, 

 మీకు అనారోగ్యం సంభవించినప్పుడు మీరు వేగంగా కోలుకుంటారని గుర్తించండి మానసిక ఆందోళనను శాంతపరుస్తుంది: మీరు లోతైన శ్వాస క్రియను అభ్యసించడం ద్వారా మీరు క్షణాల్లో ఆత్రుత ఆలోచనలు మరియు భయాలను నియంత్రించుకోవచ్చు. లోతైన శ్వాస మీ హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. శరీరం ఎక్కువ ఆక్సిజన్ ను వినియ్గించుకోడానికి అనుమతిస్తుంది. 

ఇది మీ హార్మోన్లను కూడా సమతుల్యం చేస్తుంది- కార్టిసాల్ స్థాయిలను తగ్గించడం, శరీరంలో ఎండార్ఫిన్ ఉద్ర్రుతి పెంచుతుంది.  


 

 నిద్రలేమిని అధిగమిస్తుంది: సరళమైన లోతైన శ్వాస నియమాన్ని అనుసరిస్తే ఇక మీరు మంచి సుఖనిద్రకు గ్యారంటీ ఇచ్చినట్లే. మీరు నెమ్మదిగా, లోతైన మరియు పొడవైన శ్వాస తీసుకోవడం మీ శరీరాన్ని నిర్విషీకరణ (నిర్విషీకరణ చేయడం నిద్ర పోయే క్రియలో మొదటి మెట్టు)చేయడానికి మరియు ప్రశాంత భావనకు పొందడానికి సంకేతం చేస్తుంది- ఇది మీకు బాగా నిద్రపోవడానికి సహకరిస్తుంది. 


 

 నిద్ర వత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమికి గురైన వారు మంచి నిద్ర కోసం నిద్రవేళకు ముందు ధ్యానంతో పాటు శ్వాస వ్యాయామాలు చేయమని నిపుణులు సూచించారు. 1-2-3 అని ఉచ్శ్వాసని మరియు 3-2-1 అని నిచ్వాసని పూర్తి చేయాలి. కొంత సాధన తరువాత దీనిని 1-2-3-4 మరియు 4-3-2-1 లా చేయాలి. శక్తి స్థాయిని పెంచుతుంది: రక్త ప్రవాహం పెరిగినందున, మన రక్తంలో ఎక్కువ ఆక్సిజన్ లభిస్తుంది. ఆక్సిజన్ పెరగడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి. పనిలో సమర్ధత గణనీయంగా పెరుగుతుంది. పనులు వాయిదా వేయకుండా పూర్తీ చేస్తారు. జీవితం లో ముందు ఉంటారు.  


 

భంగిమను మెరుగుపరుస్తుంది: మీరు నమ్ముతారో లేదో , ఇప్పుడు మీరు కూర్చునే భంగిమ posture మీ అక్రమమైన లోపభూయిష్టమయిన ( incorrect breathing ) శ్వాసించే విధానం వలన ఉంటుందని మీరు నమ్ముతారా? ఒకవేళ నమ్మకపోతే మీరు దీర్ఘ శ్వాస చేసేప్పుడు మీ శరీర భంగిమ (కూర్చున్న స్థితిలో) ఎలా ఉంటుందో మీరే గమనించండి. మీరు మీ ఊపిరితిత్తులను గాఢ  శ్వాస (deep breath) ద్వారా పూర్తిగా నింపినప్పుడు. మీ ఊపిరితిత్తులు మీ శరీరాన్ని, వెన్నుముఖను నిటారుగా ఉంచుతుంది. అంటే కుర్చీలో కుర్చుంటే హుందాగా, సౌక్యంగా కూర్చుంటారు. 


 

మంటను Acidity తగ్గిస్తుంది: ఈ ప్రకృతిలో క్యాన్సర్ వంటి కనంతర వ్యాధులు ఆమ్లతత్వ శరీరాలలో మాత్రమే వృద్ధి చెందుతాయని చాలా పరిశోధనలు తెలిపాయి. లోతైన శ్వాస మీ శరీరంలోని ఆమ్లతను తగ్గిస్తుందని, తద్వారా ఇది ఆల్కలీన్ గ మారుతుందని అంటారు. ఒత్తిడి మీ శరీరంలో ఆమ్లత స్థాయిని పెంచుతుంది. సుదీర్ఘ శ్వాస తీసుకోవడం వలన ఒత్తిడి తగ్గి, తద్వారా ఆమ్లత్వం తొలగించబడుతుంది. అప్పుడు కాన్సర్ మరియు అల్సర్ వంటి వ్యాధులు రాకుండా . మీ శరీరం లో ని ఆమ్లత్వం శరీరం లోని ఆరోగ్యకరమయిన కణాలను చంపి లేదా మర్చి,కేన్సర్ కణాలు (Carcinogenic) గా మార్చుతుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.


 

మన శ్వాస నుండి వెలువడే కార్బన్ డయాక్సైడ్ సహజమైన విష వ్యర్థం, ఇది మన శరీరం నుండి శ్వాస ద్వారా మాత్రమే బయటకు వస్తుంది. కానీ మన ఊపిరి తిత్తులు నిస్సార శ్వాస ద్వారా రాజీపడినప్పుడు, ఇతర నిర్విషీకరణ వ్యవస్థ ఈ వ్యర్థాలను బహిష్కరించడానికి మరింత కష్టపడటం ప్రారంభిస్తుంది. అంటే మూత్రపిండములు మరియు స్వేద గ్రంధులు తీవ్రంగా శ్రమించ వలసి వస్తుంది. ఇది మన శరీరాన్ని క్రమేణా బలహీనపరుస్తుంది మరియు నెమ్మదిగా అనారోగ్య పరిస్థితి కి దారితీస్తుంది. 

శోషరసం ప్రసరణ వ్యవస్థను ప్రేరేపిస్తుంది: శోషణ అంటే పీల్చుకోవడం. మన శరీరం లోని ప్రసరణ వ్యవస్థ లో ముఖ్యమయినది శోషరసం, రక్త ప్రవాహం లో శోషరసం కలసి ప్రవహిస్తూ గాయాలను మాన్చడానికి మరియు జీర్ణ వ్యవస్థ నుండి పోషకాలను కణముజలము లోనికి గ్రహించడానికి మరియు కణములలోని వ్యర్ధాలను తొలగించడానికి శోషరసం తోడ్పడుతుంది. ప్రసరణ ప్రేరేపించేలా పనిచేస్తుంది. 

మన శరీరంలో సోష రస వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసి తద్వారా రోగ నిరోధక శక్తిని గణనీయంగా అభివృద్ధి చేస్తుంది. మన శ్వాస రక్తం లోని శోషరసాన్ని కదిలిస్తుంది కాబట్టి, మనం నిస్సార (తక్కువ ఆక్సిజన్ స్థాయి) శ్వాస తీసుకున్నప్పుడు అది మందగించిన శోషరస వ్యవస్థకు దారితీస్తుంది, ఇది కణాలను సరిగా నిర్విషీకరణ చేయదు. 

అంటే కనస్థాయిలో జీవ చర్యలు మందగిస్తాయి. లోతైన శ్వాస క్రియ, రక్తములో శోషరసము సరిగా ప్రవహించటానికి సహాయపడుతుంది, తద్వారా మీ శరీరం మరింత సమర్థవంతంగా పని చేస్తుంది. లోతైన శ్వాస ఫలితంగా ప్రశాంతమైన నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది, జ్ఞానేంద్రియాల పనితీరు మెరుగుపడుతుంది ఇది సరైన జీర్ణక్రియను కూడా పెంచుతుంది. తద్వారా ఆకలి పెరుగుతుంది. శరీర జీవ క్రియలన్ని మెరుగుపడతాయి. 

 మానసిక సమర్ధతను పెంచుతుంది: మీరు కోపంగా, ఉద్రిక్తంగా లేదా భయపడినప్పుడు, మీ కండరాలు బిగించి, మీ శ్వాస నిస్సారంగా మారుతుంది. మీ శ్వాస పరిమితం అవుతుంది (short breath ). అట్టి సమయంలో మీ శరీరానికి కావలసినంత ఆక్సిజన్ లభించదు. దీర్ఘ , (deep breath )లోతైన శ్వాస ఈ ప్రక్రియను తిప్పికొడుతుంది, మీ శరీరం (మరియు మనస్సు) ప్రశాంతంగా మారుతుంది. మీరు మీ భావాలను (Feelings ) నియంత్రణలో ఉంచుకోవచ్చు. 


 

ఎలా చేయాలి? 

మనశరీరం లో సహజంగా శ్వాస క్రియ అనేది మన ప్రమేయం లేకుండానే అప్రయత్నంగా జరుగుతుంది. కానీ దీర్ఘ గ శ్వాస ఆలా జరగదు. దీర్ఘ శ్వాసను మనం ప్రయత్న పూర్వకంగా చేయాలి. మరి ఇప్పుడు మీరు దీర్ఘ శ్వాస వలన ఉపయోగాలు తెలుసుకున్నారు కాబట్టి దీన్ని మీరు ఒక అలవాటుగా మార్చుకోవాలి. 

రేపు మనం ఏమి వండుకోవాలి? ఏమి తినాలి అని ముందు రోజే ప్లాన్ చేసి ఉంచుకుంటాం కదా ఇదీ అలాగే, కానీ deep breath చేయడానికి ప్లాన్ చేయవలసిన నా అవసరం ఏమాత్రము లేదు. ఇది ఎప్పుడయినా చేయవచ్చు నిద్రపోయేముందు, కూర్చుని వున్నా, deep breath exercise చేయచ్చు.

 మొదట 1-2-3 గా గాలిని ;లోపలకు తీసుకుని, 3-2-1 గా గాలిని వదిలేయాలి. ఈ పరిస్థితిలో మీ ఊపిరి తిత్తులను పూర్తిగా గాలితో నింపండి. ఆలా నింపినప్పుడు మీ పొట్ట బాగా బయటకు వస్తుంది. యోగా విధానం లో దీనిని కుంభకము. పూరకము మరియు రేచకం 3 దశలు గ విభజిస్తారు. క్రమంగా గాలిని పీలచడాన్ని 1-2-3-4 గా పెంచండి.

Comments