వత్తిడి ని ఎలా అధిగమించాలి? (stress management )
stress - వత్తిడి అనేది మానవ జీవితం లో ప్రతి మనిషి ఎదుర్కొనే సంఘర్షణాత్మక పరిస్థితి. మానవ సమాజం లో ప్రతీ ఒక్కరు ఎదో ఒక సమయం లో ఎదుర్కొనే ఉంటారు. వత్తిడి కి అందరు పరిచయస్తులే.
సమానసిక శాస్త్ర నిపుణులనుబట్టి మనము ఏదయినా ఒక విషయం గురించి లేదా పరిస్థితి గురించి తీవ్ర స్థాయిలో,
ఉదృత స్థాయిలో ఆలోచిస్తున్నట్లయితే దాన్ని వత్తిడి గా పరిగణించవచ్చు.
మానవుడు శాస్త్రీయంగా ఎంత ఎదిగినా వత్తిడిని మాత్రం అధిగమించలేకపోయాడు ఒక విధంగా ఇది ఒక్కటి మానవుడి ఓటమి గా పరిగణించవచ్చును.
ఈ వత్తిడి వయసు /జెండర్ /స్తొమత అనే విభేదాలు లేకుండా ఏ ఏజ్ వారయినా ఏ ప్రాంతం వారయినా ఎదో ఒక సమయం లో
వత్తిడికి గురి అవుతూ ఉంటారు, ఎదో ఒక విషయం మీద త్రీవ్ర స్థాయిలో ఉదృతమయిన ఆలోచనలు చేస్తూ ఉంటారు.
వీరు పనిలో ఉన్న నిద్ర లో ఉన్న చివరకి ప్రయాణం లో ఉన్న కూడా వారికీ అదే ఆలోచన. దీనినే మన పెద్దలు "మనాది" అనేవాళ్ళు కావచ్చు. మనది పడకు అనే మాటను ఒకప్పుడు తరచూ వినేవాళ్ళం. కానీ అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో
అని అంటారు.
నిజమే జీవితమంతా కుటుంబంకోసం కస్టపడి మలి వయస్సులో పిల్లల ప్రేమ దొరకక తపించి పోయే వృద్ధుల మానసిక వత్తిడి, జాబ్ లేని వాళ్లకు జాబ్ ఎప్పుడు వస్తుందని టెన్షన్, ఇంటర్వ్యూ ఎలా పేస్ చేయాలనీ టెన్షన్, జాబ్ వచ్చాక ఆ జాబ్ లో కొనసాగాలంటే భయం, ఆఫీస్ లో ఎత్తులు పై ఎత్తులు వేసేవాళ్ళు బాస్ వలన వత్తిడికి గోరి అయ్యే వాళ్ళు ఎంతమంది లేరు?
అప్పుడే పెళ్లయిన కొత్తకోడలికి వాళ్ళ తల్లిదండ్రులకు భయం అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అత్తవారితో కాస్త తగ్గి ఉండడం మనం గమనించలేదా ?
పసిపిల్లలకు మానసిక వత్తిడి ఉండదా? హోమ్ వర్క్ లు, పనిషమెంట్ లు, స్కూల్ లో బెదిరించే సహా విద్యార్థులు, కభయపెట్టే టీచర్లు
చిన్నప్పుడు స్కూల్ బెల్ వింటేనే వంట్లో వణుకు మొదలయ్యేది. కానీ దురదృష్ట వశాత్తు మన స్కూల్స్ లో గని కాలాగే లో గని ఈ వత్తిడిని ఎలా అధిగమించాలి అనే అంశాన్ని బోధించారు.
కానీ ఈరోజు వత్తిడి ని తట్టుకోలేక దాని తో పోరాడలేక లొంగిపోయి జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు ఎంతోమంది న్యూస్ ల్లో చూడడం లేదా? కానీ న తపన ఒకటే, ప్రతి ఒక్కరు వత్తిడి ని అధిగమించి గుండెలనిండా శ్వాస తీసుకోగలగాలి. అందనడం తో జీవించాలి
బానిసల కాదు. కింగ్ ల జీవించాలి. ఇక ముందు చదవండి....

Hi
ReplyDelete..